
(కర్నూలు ఆంధ్రన్యూస్) కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో SC, BC సాంఘిక సంక్షేమ హాస్టల్ లను సబ్ కలెక్టర్ ప్రజా ప్రతినిధులు కూడా తనిఖీలు చేయాలి,హాస్టల్ లో నెలకొన్న సమస్యలను తెలుసుకోవాలని DSF విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము.అనంతరం ఆర్ట్స్ కళాశాలలో లైబ్రరీ దగ్గర ప్రెస్ మీట్.ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి DSF డివిజన్ అధ్యక్షుడు చిన్న మండల అధ్యక్షుడు దానిల్ మాట్లాడుతూ.ఆదోని డివిజన్ లో SC, BC సాంఘిక సంక్షేమ హాస్టల్ లో అధికారులు తనిఖీలు చేపట్టాలని DSF విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాయి.కొన్ని హాస్టల్ లో వాటర్ ఫెసిలిటీస్ గాని మెనూ ప్రకారం గా అన్నం పెట్టకపోవడం గాని ఇలా కొన్ని హాస్టల్లో జరుగుతున్నాయి.విద్యార్థులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది.కావున విద్యార్థులకు నాణ్యత మైన భోజనం అందించాలి అలాగే హాస్టల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.ఒకసారి అధికారులు ప్రజా ప్రతినిధులు విద్యార్థుల వైపు కన్నెత్తి చూసి హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యలు ఏమున్నా యని తెలుసుకోవాలని మరొక్కసారి తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు వినోద్ కిరణ్ రమేష్ అభిరామ్ జగదీష్ తదితరులు పాల్గొనడం జరిగింది.



