కోసిగి.నవంబర్10( ఆంధ్రన్యూస్)
కోసిగి లో మండల కేంద్రంలోని గురువారం 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్ల విడుదల కార్యక్రమం మండల గ్రంథాలయ ఇంచార్జి అధికారిని ఆశాజ్యోతి సమక్షంలో జరిగింది.ఈ కార్యక్రమానికి. ముఖ్య అతిథులుగా వైసిపి మండల ఇంచార్జి మురళీ రెడ్డి కోసిగి మండలం ఎంపిపి వలకుశ ఈరన్న, సింగిల్ విండో అధ్యక్షులు మహంతేష్ స్వామి లు హాజరై విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు.అందులో భాగంగా 15వ తేదీ పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు, 17న కవి సమ్మేళనాలు, సెమినార్లు, రచయితల సందేశాలు వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. గ్రంథాలయాన్ని యువతీ, యువకులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, వైసిపి నాయకులు, గ్రంథాలయం సిబ్బంది పాల్గొన్నారు.