కౌతాళo మండలానికి ఆర్ అండ్ బి అధికారులు ఉన్నట్ల ! లేనట్లా !కంబలి తాత బ్రిడ్జి వెంటనే నిర్మించకపోతే సిపిఎం పార్టీగా ఆందోళనలు ఉదృతం చేస్తాం.

0
144

కౌతాళం (ఆంధ్రన్యూస్)

కౌతాళం మండలం బదినే హాల్ గ్రామం కంబళి తాత దగ్గర వంక బ్రిడ్జి కూలిపోయి మూడు సంవత్సరాలైనా అధికారులు, నాయకులు నిర్మించకపోవడం వల్ల సిపిఎం పార్టీగా సంతకాల సేకరణ మండల కన్వీనర్ మేలి గిరి ఈరన్న అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కే మల్లయ్య మాట్లాడుతూ కంబళి తాత దగ్గర వంకకు అధిక వర్షాల వల్ల బ్రిడ్జి కూలిపోయి మూడు సంవత్సరాలు అయినది. ఈ రోడ్డు మార్గము గుండా కర్ణాటక రాష్ట్రానికి కూడా రవాణా సౌకర్యము కలదు . బ్రిడ్జి పడిపోవడం వల్ల రాకపోకలు పూర్తిగా ఇబ్బందికరంగా, అసౌకర్యంగా తయారైనది. స్కూలు పిల్లలకు ,రైతులు వ్యవసాయo కు పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు . అయినా అధికారులకు, నాయకులకు చీమకుట్టినట్లయినా లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే జోక్యం చేసుకొని బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేసినారు. ఆర్ అండ్ బి అధికారులు అయితే మండలంలో ఏ ఒక్క రోడ్డును కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవు బదినే హాళ నుంచి కౌతాళం కు పోయే రోడ్డు చాలా అధ్వానంగా వెహికల్స్ కూడా తిరగలేని పరిస్థితి ,కంపు చెట్లు పేర్కొని ముందు వెహికల్ కూడా కనబడలేనంత పరిస్థితి ఏర్పడినది. బదినేహాళ నుంచి కొత్తూరు మీదుగా రోడ్డు కూడా చాలా అధ్వానంగా తయారైనది. అందుకు ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్పందించి రోడ్లు వేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉలిగయ్య, శంకర్ , వలి, చాంద్ బాషా, వెంకటేష్ ,మల్లి, మా భాష ,కటిక రాజా, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here