మెట్టజ్యోతి: జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయము నందు యూనిసెఫ్ సహకారంతో పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ మెప్మా ఆద్వర్యం లో సబ్బుతో చేతులు శుభ్రత ఆరోగ్యకర జీవితానికి భద్రత (హ్యాండ్ వాష్) ట్యాంకును చింతలపూడి శాసన సభ్యులు ఉన్నమట్ల ఏలిజా మరియు చైర్ పర్సన్ బత్తిన లక్ష్మీ ప్రారంభించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్, వైస్ చైర్ పర్సన్స్ , కౌన్సిల్ సభ్యులు , కో ఆప్షన్ మెంబర్స్ , మెప్మా డిపార్ట్మెంట్, మరియు పట్టణ నాయకులు మున్సిపల్ అధికారులందరూ పాల్గొన్నారు.
ఈ సందర్బం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ రద్దీగా ఉండే ప్రదేశాలలో పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వాష్ ట్యాంక్ లను అందుబాటులో కి తీసుకోస్తాం అని చెప్పారు. అదేవిదముగా కరోనా దృష్ట్యా ప్రజలందరూ తప్పని శానిటైజర్స్ మరియు మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సిహెచ్ అచ్యుత రామయ్య నంబూరి రామచంద్ర రాజు మండల వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ వామిశెట్టి హరిబాబు దేవులపల్లి సర్పంచ్ దోరేపల్లి సత్యనారాయణ ఎల్విఆర్ టిపిఓ జగదీశ్వరరావు వైయస్సార్ పార్టీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చందర్రావు తదితరులు పాల్గొన్నారు