
హిందూ మత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ” చిన్న జీయర్ స్వామి ”
పెదపూడి, ఆంధ్రన్యూస్ బ్యూరో , మే 10 : హిందూ మత పరిరక్షణకు ప్రతి ఒక్క హిందూ పౌరుడు కృషి చేయాలని, దేవాలయాల పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరూ చేపట్టాలని శ్రీ అలివేలుమంగా, పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గాలి గోపురం నిర్మాణం కార్యక్రమంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. కాకినాడ జిల్లా గొల్లలమామిడాడ గ్రామంలో ఆలయ ధర్మకర్తలు నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణరెడ్డి,నల్లమిల్లి మోహనరామగంగాధరరెడ్డి ల ఆధ్వర్యంలో శ్రీ అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్మించనున్న గాలిగోపురం నిర్మాణానికి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి శంకుస్థాపన చేశారు. చిన్న జీయర్ స్వామికి ఆలయ అర్చకులు ఆరవెల్లి సుందర రఘ రామాచార్యులు బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, చిన్న జీయర్ స్వామి వేదమంత్రాలతో గాలి గోపర నిర్మాణానికి శంకుస్థాపన పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులను ఉద్దేశించి చిన్న జీయర్ స్వామి చేసిన ప్రసంగం యావత్ భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనంతరం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి వారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కుమారి నల్లమిల్లి గాయత్రి సౌజన్య చేసిన భరతనాట్య నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ద్వారంపూడి పద్మ వెంకటరెడ్డి (చింతపండు), జెసిఎస్ మండల ఇన్చార్జ్ కర్రి శ్రీ వెంకటరెడ్డి, ద్వారంపూడి ప్రభాకర్ రెడ్డి (హంస), ఉప సర్పంచ్ తాతారెడ్డి, చింతా దొరబాబు యూత్, తదితరులు పాల్గొన్నారు



