Thursday, April 18, 2024
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాసైబర్ మోసాలకు, నకిలీ లోన్ యాప్ దారుణాలకు గురి కాకుండా ప్రజల్లో అవగాహన తీసుకురావాలి... కర్నూలు...

సైబర్ మోసాలకు, నకిలీ లోన్ యాప్ దారుణాలకు గురి కాకుండా ప్రజల్లో అవగాహన తీసుకురావాలి… కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్.

సైబర్ మోసాలకు, నకిలీ లోన్ యాప్ దారుణాలకు గురి కాకుండా ప్రజల్లో అవగాహన తీసుకురావాలి… కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్.
గ్రామ/వార్డు మహిళా పోలీసుల తో విడియో కాన్ఫరెన్సులో సమీక్షా సమావేశం నిర్వహించిన…జిల్లా ఎస్పీ.
నేర నియంత్రణే ధ్యేయంగా పోలీసులు కృషి చేయాలి.
పోలీసు అధికారులు ,గ్రామ/వార్డు సచివాలయ మహిళా పోలీసులతో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ వారు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని విడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి,పలు సూచనలు చేశారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
ప్రతి ఇంటికి( డోర్ టు డోర్ ) మహిళా పోలీసులు వెళ్ళి వారికి సంబంధించిన సమస్యల గురించి విచారించాలన్నారు. సమస్యలను కనుక్కొని పరిష్కరించే విధంగా చూడాలన్నారు.
జిల్లా పోలీసు అధికారులు, మహిళా పోలీసులతో స్టానిక సమస్యలపై డోర్ టు డోర్ సర్వే నిర్వహించి, నివేదికలు గూగుల్ షీట్ లో అప్ లోడ్ చేయాలన్నారు.
భార్యభర్తల తగాదాలు, అన్నదమ్ముల తగాదాలు, కుటుంబ సమస్యలు, సరిహద్దు తగాదాలు, ప్రేమ వ్యహారాలు, ఆకతాయి ఆగడాలు, అసాంఘిక కార్యకలాపాలు , తీవ్రమైన నేరాల సమాచారం గురించి సమగ్ర నివేదిక తయారు చేయాలని,గ్రామ స్థాయిలో మహిళా పోలీసులు క్షేత్ర స్థాయిలో సమస్య చిన్నగా వున్నపుడే గుర్తించి యస్.హెచ్.ఓ. వారి దృష్టికి తీసుకెళ్ళాలన్నారు.
ఆ సమాచార నివేదిక ను స్థానిక యస్.హెచ్.ఒ.లకు అందించాలని,సదరు సమస్యలను SHOలు చట్టపరిధిలో పరిష్కరించాలన్నారు.
మహిళా పోలీసులు ప్రతి గ్రామ సచివాలయం వద్ద డయల్ 1930 (సైబర్ క్రైమ్), 112 మరియు దిశ (SOS) యాప్ గురించి,వాటి ఉపయోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ఉన్నతమైన సేవలందించాలన్నారు.
శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
పోలీసులు పరిష్కరించే సమస్యల గురించి ప్రజలు కూడా మహిళా పోలీసులకు తెలియజేస్తే పరిష్కరిస్తారన్నారు.
సమాచార సేకరణ గురించి , సర్వేలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని మహిళా పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకటాద్రి, జిల్లా లోని మహిళా పోలీసులతో సహా డిఎస్పీలు, సిఐలు,ఎస్సైలు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బి అబ్రహం 9640441653

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments