మండపేట : సిట్టింగ్ లకు సీటు ఖరారు అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు టీడీఎల్ఫీ సమావేశంలో ప్రకటించ
డంతో మండపేట లో తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తుఫాన్ బలంగా వీచినప్పటికి మండపేటలో మాత్రం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు హవాను అడ్డుకోలేక
పోయింది. నిబద్ధత, నిజాయితీ కలిగిన గొప్ప నాయకుడు బోసు పైనే సునాయాసంగా విజయం సాధించడం వేగుళ్లకే చెల్లింది. మరో వైపు గడిచిన మూడున్నరేళ్లలో వివిధ అంశాలపై అధికార పార్టీతో పోరాడుతూ తన గళాన్ని బలంగానే వినిపించారు. ఇటీవల చంద్రబాబు
తోజరిగిన భేటీలొనే సీటునీదే ఇప్పటి నుండి కార్యాచరణ చేసుకోవాలని ఎమ్మెల్యే వేగుళ్ల కు సూచించినట్లు సమాచారం. ప్రతి రాజకీయ నాయకుడుకు సీటు దక్కించుకోవడం అనేది ఓ పెద్ద సవాల్ గా ఉంటుంది. దానిపై ఓ స్పష్టత వస్తేనే గాని ప్రశాంతత లభించదు. అయితే ఏడాదిన్నరకు ముందే సీటుపై స్పష్టత రావడం
తో ఈ సారి మరింత బలంగా పార్టీ పటిష్ఠతకు పాటు పడే అవకాశం ఉంటుందని తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సిట్టింగులకే సీటు కరారు
RELATED ARTICLES