Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeఅల్లూరి సీతారామరాజు జిల్లాసిఐటియు అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి.

సిఐటియు అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి.

సిఐటియు అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి.

రంపచోడవరం : ఆంధ్ర న్యూస్ డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు జరిగే సిఐటియు జాతీయ మహాసభలను జయప్రదం చేయండి అని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరావు పిలుపు నిచ్చారు.బుధవారం రంపచోడవరంలోని యుటిఎఫ్ కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏవి నాగేశ్వరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన ఈ 79 ఏళ్ల కాలంలో కార్మికుల పైన ఎప్పుడు లేని నిర్బంధాలను కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రయోగిస్తుందని కార్మికులకు ఉన్న హక్కులు చట్టాలను కాలరాస్తూ కార్మికులను బానిసలుగా తయారు చేసేటువంటి విధానాలను తీసుకొస్తుందని విమర్శించారు.దేశంలో ఉన్నటువంటి కార్మికులు, రైతులు,వ్యవసాయ కార్మికులు కి నష్టం చేస్తూ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచి పెట్టేందుకు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దాని కనుసన్నలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని అన్నారు.భవిష్యత్తులో కార్మికులకు ఎదురైనటువంటి సమస్యలు కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులతో కలిపి ఐక్య పోరాటాలు నిర్మించేందుకు విశాల ఐక్యవేదికను ఏర్పాటు చేసేందుకు విశాఖ నగరంగా జాతీయ మహాసభలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కార్మికులకు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా సంవత్సరం దాటిన దాస్సారం చేస్తుందని కార్మికులకు ఉద్యోగులకు నష్టం చేసే విధానాలను తీసుకొస్తూ ఎన్డీఏ కూటమికి వత్తాసు పలుకుతుందని తెలిపారు. కార్మికులందరినీ ఐక్యం చేసి పోరాటాల్లో తీసుకొచ్చే దానికోసం అఖిలభారత మహాసభల జయప్రదానికి ప్రతి ఒక్క కార్మికుడు పూనుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకట్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కిరణ్, సిఐటియు జిల్లా అధ్యక్షులు వాణిశ్రీ, నాయకులు రామరాజు,నిర్మల,రామలక్ష్మి, సీతారామయ్య,ఐ వి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments