
ఆంధ్రన్యూస్, రంపచోడవరం పరిష్కరించిన జిల్లా కలెక్టర్ కి ధన్యవాదాలు
ఆదివాసి సంఘాలు, హ్యూమన్ రైట్స్ సంఘాలు.
రంపచోడవరం: ఆంధ్ర న్యూస్ ఆశ్రమ పాఠశాలలో చదువుతూ మరణించిన విండేలా వివేకానంద రెడ్డి 9వ తరగతి విద్యార్థి గత మూడు రోజులుగా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉండడం ఐ టి డి ఏ పి ఓ, డిప్యూటీ డైరెక్టర్ సరి అయిన బాధ్యత తీసుకుపోవడం వలన గిరిజన సంఘాలు, రైతు కూలీ సంఘాలు, గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది, అయినప్పటికీ పధక నిర్వాహణ అధికారి కనీసం ఆస్పత్రికి వచ్చి పరామర్శించిన దాఖలు లేవు, ఆసుపత్రికి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ బాధ్యతారహితంగా ప్రవర్తించడం వలన ఆదివాసి చైతన్య వేదిక అధ్యక్షులు వెదుర్ల లచ్చిరెడ్డి ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ IAS తో ఫోన్లో మాట్లాడటం జరిగింది స్పందించిన కలెక్టర్ మృతి చెందిన కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వటానికి హామీ ఇచ్చినారు, కలెక్టర్ గారు చొరవతో గత మూడు రోజులుగా చేస్తున్న ఆందోళన విరమించినారు, ఈ కార్యక్రమంలో వెదుర్ల లచ్చిరెడ్డి గిరిజన చైతన్య వేదిక పల్లాల లచ్చిరెడ్డి ఏఐకేఎంఎస్ పల్లాల అనసూయ, చిలకమ్మా, పిఓడబ్ల్యు బాలు అక్కిస హ్యూమన్ రైట్స్ వాచ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు, మద్దిలేటి అంజిరెడ్డి భారత ఆదివాసి పార్టీ రంపచోడవరం నియోజవర్గం ఇంచార్జ్క, కట్రం రామదాసు దొర ఆదివాసీ విద్యార్థి సంఘం, గొర్లె ప్రణీత్ కుమార్ వాల్మీకి సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు, ఐ వి రమణ ఆదివాసి రైట్స్ ఫారం ప్రెసిడెంట్ ఈక నరసన్న ధర రైతు కూలి సంఘం, నాక్కల శ్రీను భారత ఆదివాసి పార్టీ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.



