
ములకలచెరువు : ఆంధ్రన్యూస్ ప్రభుత్వం కేటాయించిన హౌసింగ్ స్థలాలను సద్వినియోగం చేసుకోని, ఇళ్ల నిర్మాణాలు చేపట్టని హౌసింగ్ లబ్ధిదారులను హౌసింగ్ జాబితా నుండి తొలగించి, నిజంగా ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించి, ఇళ్ల స్థలాల పట్టాలను జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ములకలచెరువు మండల కేంద్రంలోని సిఎల్ఆర్సి భవనంలో అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఇళ్లకు కేటాయించి, ఇళ్ల నిర్మాణాలకు నిధులు పంపిణీ చేయకుండా కొంతమంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండా, ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను అమ్ముకోవడం జరుగుతున్నట్లు తెలిసింది. అలాంటి వారిని తొలగించి, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని హౌసింగ్ అధికారులకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అపార్ట్‌మెంట్ డిజిటల్ కార్డులను తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఐసీసీ తెలియజేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులు తెలియజేశారు. అనంతరం ములకలచెరువు మండల కేంద్రం చేపడుతున్న సిసి రోడ్లను పరిశీలించారు. ములకలచెరువు మండల కేంద్రానికి వచ్చిన జిల్లా కలెక్టర్ శ్రీధర్, సబ్ కలెక్టర్ మేఘస్వరూపులను తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ ఇంచార్జి దాసిరిపల్లి జయచంద్ర రెడ్డి స్వాగతం పలికి పూలమాలవేసి దుశ్యాలతో సన్మానించారు. మొలకలచెరువు మండల ప్రభుత్వ గెస్ట్ హౌస్ ను చేసి నిధులు కేటాయించాలని నిర్ణయించారు. అనంతరం సోంపల్లి గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆలయ అభివృద్ధి కోసం నిధులు సేకరించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు ఉన్నారు….






