
ఆంధ్రన్యూస్ : శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నవరం శ్రీ సత్య మారుతీ ఆస్పత్రిలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కాకినాడ ఇనోదయ హాస్పిటల్ వైద్యులు శిబిరానికి హాజరైన వారికి వివిధ పరీక్షలు చేశారు. అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి డాక్టర్లకు ఆరోగ్య సమస్యలను తెలియజేశారు. వైద్య పరీక్షలు అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ స్పూర్తి ఫౌండేషన్ తరుపున సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్పూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ఎస్ఆర్, సభ్యులు దుర్గాప్రసాద్, వీరబాబు, సాయిరాం, శ్రీను, రామకృష్ణ, సూర్య, దొరబాబు, సుబ్బు, గంగాధర్ యాదవ్, శ్రీనివాస్, స్వామి, మురళి తదితరులు పాల్గొన్నారు..



