
(కర్నూలు ఆంధ్రన్యూస్) కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో :
మంత్రాలయం నుంచి మంగళూరు వయా ఉడిపి,మనిపాల్,కుందాపూర్,శివమెగ్గ,బళ్లారి మీదుగా వెళ్లేందుకు శ్రీ సన్నిధి ట్రావెల్స్ యాజమాన్యం మంగళూరు కు చెందిన సతీష్ నూతనంగా ఏర్పాటు చేసిన స్లీపర్ బస్సు సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నేత వై.ప్రదీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మంగళూరు సతీష్ ఆధ్వర్యంలో వై.ప్రదీప్ రెడ్డికి బోకే అందజేసి స్వాగతం పలికారు.అనంతరం వై.ప్రదీప్ రెడ్డి బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.బస్సు లోపలి భాగంను పరిశీలించి మంత్రాలయం వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. జెండా ఊపి బస్సు ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వైఎస్సార్సీపీ నాయకులు బూదూరు లక్ష్మి నారాయణ రెడ్డి, బొజ్జప్ప, రాము, మారెప్ప తదితరులు ఉన్నారు.



