
ఆంధ్రన్యూస్ : శంఖవరం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నవరం గ్రామ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్య అన్నదానం సత్ర అధ్యక్షులుగా పేరూరి గాంధీ ఎన్నికయ్యారు.శ్రీ వాసవీ కన్యకపరమేశ్వరి నిత్య అన్న సత్ర సమాజం అన్నవరం లో ఆదివారం నాడు జరిగిన సర్వ సభ్య సమావేశం లో 2023-2025 సం”లకు గాను అధ్యక్షులు గా శ్రీ పేరూరి గాంధీ మరియు కార్యదర్శి గా డా”రేపాక రామ సత్యనారాయణ-అనకాపల్లి ని ,కోశాధికారిగా శ్రీ తల్లం సత్యారావు-బెండపూడి గ్రామస్తుల్ని హాజరైన సభ్యులు అందరూ ఆమోదంతో ఏకగ్రీవముగా నియమితులైనారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు గాంధీ మాట్లాడుతూ ఆర్యవైశ్యులంటే చప్పున గుర్తుకొచ్ఛేది నిజాయితీ పరులని , తన సంపాదనలో కొంత భాగం ధర్మ కార్యాలకుపయోగిస్తారని అన్ని దానాలకన్న అన్నదానమే శ్రేష్టమని నమ్ముతారని దేవాలయాల్లో దైవదర్శనం చేసుకున్న ఆర్యవైశ్యులకు భోజన సదుపాయము కల్పించాలన్న ఉద్దేశ్యముతో దేవాలయాల పరిసరాల్లో ఆర్య వైశ్య నిత్యాన్న సత్రాలను ఏర్పరచి వారికి షడ్రతోపేతమైన భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని కావున దేవాలయాలకెళ్లే ప్రతి ఆర్యవైశ్యుడు ఆర్యవైశ్య సత్రాల్లో భోజనం చేయాలని కోరారు , కొంతమంది సత్రాల అడ్రస్ తెలీక దగ్గరలోనున్న ఏ హోటల్లోనో భోజనం ముగిస్తుంటారని ఆర్యవైశ్యులందరికి మన సత్రాల గురించి తెలియజేయవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని ఆయన కోరారు.
ఈ కార్యక్రమం లో సభాధ్యక్షులు శ్రీ బచ్చు రాజుబాబు, గౌరవ అధ్యక్షులు శ్రీ చక్కా సూర్య నారాయణ మూర్తి (తాత బాబు),తదితరులు పాల్గొన్నారు,ఈ ఏకగ్రీవ నిర్ణయం పట్ల సత్రం కమిటీ సభ్యులు అందరూ హర్షం ప్రకటించారు.



