
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గణపతి నవరాత్రి సందర్భంగా అన్న సమారాధన
ఆంధ్ర న్యూస్: మండపేట: మండపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు పూజలు గణపతి హోమం ఏక రుద్రాభిషేకం గరిక పూజ శ్రీవాసవి యూత్ ఆధ్వర్యంలో పెన్నలు తో పూజ ప్రతిరోజు ఆటలు పోటీలు కార్యక్రమాలు లడ్డు పాటలు ఘనంగా జరిగాయి. ఈరోజు శుక్రవారం 5.9.2025 తేదీన గణపతి నవరాత్రి కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు శ్రీవాసవి యూత్ సభ్యులు శ్రీ ఆర్యవైశ్య సేవ సంఘం సభ్యులు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్లకూరి గొల్ల బాబు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాకచర్ల గుప్తా నాగభూషణం మోగంటి రామకుమార్ అక్షింతల స్వామి ఆర్యవైశ్య పెద్దలు. ఆర్యవైశ్య సోదర సోదరీమణులు భక్తులు 1200 మంది పాల్గొన్నారు.రేపు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు వినాయకుడు ఊరేగింపు బాణాసంచాతో అంగరంగ వైభవంగా జరుగుతుంది..



