
(కర్నూలు ఆంధ్రన్యూస్) కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కౌతాళ మండలం ఉరుకుంద గ్రామం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థాన కార్యాలయం నందు డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి శ్రీమతి కె.వాణి వారి ఆధ్వర్యంలో, గ్రేడ్-1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పి.సీ రాంప్రసాద్ ఆదోని వారి పర్యవేక్షణలో ఈరోజు జరిగిన ఆన్లైన్ టెండర్లు మరియు సీల్డ్ టెండర్ నందు వచ్చిన వివరములు..
*ఆన్లైన్ నందు ఎవరు టెండర్ వేసియుండలేదు*
అగరబత్తి టెండర్ నకు ఎవరు కూడా టెండర్ వేసుకొనియుండలేదు.
సిల్డ్ టెండర్ నందు ఆరు కిరాణా సరుకులకు గాను విశ్వగంగా అసోసియేట్స్, ఆదోని వారు రెండింటికి 1.బెల్లం ఒక కేజీ రూ.23/-లకు గాను
2.కందిబ్యాళ్ళు ఒక కేజీ రూ.52.20/-లకు గాను హెచ్చుపాటదారునిగా నిలిచియున్నారు.
గంగులి రామిరెడ్డి, ఉరుకుంద వారు మిగిలిన నాలుగు కిరాణా సామాగ్రికి 1.కలగలపు బియ్యం ఒక కేజీ రూ.20/-లకు గాను
2.బియ్యం ఒక కేజీ రూ.28/-లకు గాను
3.శనగబ్యాళ్ళు ఒక కేజీ రూ.41/-లకు గాను
4.రవ్వ ఒక కేజీ రూ.25/-లకు గాను హెచ్చు పాటదారునిగా నిలిచియున్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన పర్యవేక్షకులు, సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొనియున్నారు…



