శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, నందు యోగ సాధన కార్యక్రమం
మెట్టజ్యోతి , రాయవరం : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రము రాయవరం శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, నందు సాయంత్రం 4 గంటలకు పాఠశాల విద్యార్థులకు మరియు స్టాఫ్ మెంబర్స్ కు సహజ యోగ సాధన కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమమునకు సభాధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పప్పు శ్రీనివాస రెడ్డి వ్యవహరించగా ముఖ్యఅతిథిగా డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి , సభా కార్యక్రమ నిర్వాహకులుగా గొల్లల మామిడాడ సహజ యోగ ధ్యాన మందిర వ్యవస్థాపకులు మరియు ఫార్మర్ డైరెక్టర్ ఇన్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ కె .సుబ్బి రెడ్డి, సుబ్బారావు ఎక్స్ సర్వీస్మెన్, వి సుబ్బలక్ష్మి , పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ టీవీఎస్ చౌదరి, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఎస్. ఏ. రెహమాన్, పాఠశాల పి డి ఎన్. అప్పా రెడ్డి, సోషల్ అసిస్టెంట్ జి. సీతాదేవి, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. కర్రిసుబ్బిరెడ్డి మాట్లాడుతూ సహజ యోగ సాధన ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని జయించ వచ్చని ఇది విద్యార్థి దశ నుంచి చాలా ఉపయోగ పడుతుందని చెప్పారు . సుబ్బారావు సహజ యోగ ధ్యానం చేయడం ద్వారా కలిగే లాభాలను చక్కగా చెప్పడం జరిగింది. డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ యోగా వలన కేవలం మనసుకు శరీరానికే కాదు మానవునికి పరిమితమైన అవగాహనను యోగ అపరిమితమైన అవగాహన గా మారుస్తుందని తెలియజేశారు.. మనలో ఏర్పడే అధిక ఒత్తిడికి సరైన పరిష్కారం యోగ ధ్యానమే అని తెలియజేశారు.