కౌతాళం డిసెంబర్ 04 ఆంధ్ర న్యూస్ కౌతాళం మండల పరిధిలో ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానములు- హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు దేవదాయ ధర్మదాయ శాఖ సంయుక్త నిర్వహణలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న భగవద్గీత జ్ఞానయజ్ఞం 18 కేంద్రాలలో భాగంగా కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుందలో వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం నందు శ్రీమద్భగవద్గీత జ్ఞాన యజ్ఞం అత్యంత భక్తిశ్రద్ధలతో ముగిసినది. ముగింపు సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి / అసిస్టెంట్ కమీషనర్ కె. వాణి మాట్లాడుతూ డిసెంబర్ 4వ తేదీ ప్రారంభమైన ఈ గీతా జ్ఞాన యజ్ఞం ఈ రోజు గీతా జయంతి వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ఒక అధ్యాయం చొప్పున పారాయణం మరియు ప్రవచనం సాగిందని, సర్వమానవాళికి శ్రీమద్భగవద్గీత దిక్సూచి అన్నారు. శ్రీమద్భగవద్గీత సమస్త మానవాళిని దుఃఖం నుండి ఉపశమనం కలిగించటంతోపాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుందని తెలిపారు. భగవద్గీత ప్రవచకులు మాచాని నాగరాజు పండిత పామరులకు అర్థమయ్యే విధంగా చేసిన భగవద్గీత ప్రవచనం, పారాయణం భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అధీక్షకులు కె.వేంకటేశ్వరరావు, మల్లిఖార్జున, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డితో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823