
ఆంధ్రన్యూస్ : ఏలూరు. ఏలూరు కొత్తపేటలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి 43వ జాతర మహోత్సవాలకు రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు శ్రీ ఆళ్ల నాని గారిని ఆహ్వానిస్తూ క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందచేసిన ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు.
ఏలూరు : నాలుగు దశాబ్దాలపైగా విశిష్ఠ చరిత్ర కలిగి ఏలూరు ప్రజలచే పూజలు అందుకుంటున్న కొత్తపేటలోని శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారికి ప్రతియేటా జరిగే జాతర మహోత్సావానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు.
ఏలూరు శ్రీరామ్ నగర్లోని మాజీ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరుజిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నానిని ఏలూరు కొత్తపేటలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
కొత్తపేటలో జరుగుతున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి 43వ జాతర మహోత్సావాలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నానిని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందచేసారు..
ఆలయ అభివృద్ధి కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ “ఏలూరు కొత్తపేటలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉందని అన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పైగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఏలూరు ప్రజలు అమ్మవారికి పూజలు అందిస్తున్నారు అని అన్నారు.నమ్మిన వారి కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ నూకాలమ్మ అమ్మవారిని భక్తులు కీర్తిస్తారని అన్నారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతరను అత్యంత ఘనంగా నిర్వహించాలని, జాతరకు విచ్చేసే అశేష భక్త జనానికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ ఏర్పాట్లు చేయాలని ఆళ్ల నాని ఉత్సవ కమిటీసభ్యులకు సూచించారు..
ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, కార్పొరేటర్ పొలిమేర దాసు, వైఎస్సార్ సిపి నాయకులు జనపరెడ్డి కృష్ణ,ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నక్కా.నాగేశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..



