ఆంధ్రన్యూస్ : కిర్లంపూడి కాకినాడ జిల్లా : గ్రామ రైతాంగంతో పాటు గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలు కల్గి ఆనందంగా జీవించాలంటే ఆధ్యాత్మిక చింతన వైపు ప్రతి ఒక్కరు దృష్టిసారించాలని సీనియర్ వైసిపి నాయకులు శెట్టి సోమరాజు మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో శెట్టివారి ఇంటిఇలవేల్పు అయిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో సోమరాజు తన కుటుంబ సభ్యులతో పాటు పాల్గొని అన్నదానం స్వీకరించారు. ముందుగా ఇటీవల కాలంలో దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శ్రీ దేవీ శరన్నావరాత్రులను పురస్కరించుకొని దేవతామూర్తుల వేషాలు ధరించి ఆ యొక్క సంబరాలు విజయవంతం కావడానికి కృషి చేసిన 28 మంది గ్రామ యువకులను గుర్తించి శెట్టి సోమరాజు తన సొంత ఖర్చులతో పూల మాలలు దుశ్శాలువాలు కప్పి ఆయన చేతుల మీదగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ ఏనాటి నుంచో అమ్మవారిని తమ కుటుంబ సభ్యులు ఆరాధిస్తూ వస్తున్నారని అదే ఆనవాయితీనీ తాము కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. అమ్మవారి ఆలయంలో ఏ కార్యక్రమాలు చేపట్టిన గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఎటువంటి రాగద్వేషాలకు తావులేకుండా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని సోమరాజు తెలిపారు. అదేవిధంగా గ్రామస్తులు మాట్లాడుతూ శెట్టి వారి దుర్గమ్మ మహా మహిమ గల తల్లి అని కీర్తించారు. అమావారిని కొలిచినప్పటి నుండి గ్రామస్తులంతా సుభిక్షంగా జీవించగలుగుతున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి నూకరాజు, శెట్టి చందర్రావు, శెట్టి రాంబాబు, శెట్టి సత్తిబాబు, కోన శేషగిరిరావు, గండేరాయుడు, శెట్టి శ్రీను, శెట్టి సాంబమూర్తి, శెట్టి నాగేశ్వరరావు, చిట్నీడి సూర్యరావు, చింతలపూడి బాబ్జి, శెట్టి కాటన్న, శెట్టి నాద, అలాగే గ్రామ పెద్దలు గ్రామ మహిళలు చిన్నారులు విద్యార్థులు పాల్గొన్నారు.
శెట్టివారి దుర్గమ్మచెంత మహగొప్ప అన్నదానం.
RELATED ARTICLES