కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం కుమ్మలనూరు గ్రామంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలోయూనిట్ ఇంచార్జ్ వి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు వారి మొబైల్ నెంబర్ తో మిస్సేడ్ కాల్ ఇవ్వడం జరిగింది. నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలో వచ్చి తర్వాత ప్రజలను నానా ఇబ్బంది పాలు చేసినారు నిత్యవసర ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినారు గ్రామములో నీటి సమస్యలు సి సి రోడ్డు డ్రైనేజీలు ఇలా ఎన్నో చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఎలాంటి సమస్యలు అయినా పరిష్కరిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టాభి ,మదేవ ,ఈరన్న ,ముత్తన్న డీలర్ ఈరన్న ,నరసింహులు, మారుతి ,చెన్న, సుంకప్ప ,హనుమేష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు