
(ఆంధ్ర న్యూస్ కర్నూలు)
కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండలం చిన్న బొంపల్లి గ్రామ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కౌతాళం ఊసేని (42) మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు.ఈవిషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి,మండల ఇంచార్జీ/జిల్లా కార్యదర్శి పి మురళీ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం చిన్న బొంపల్లి గ్రామానికి చేరుకుని,ఉసేని మృతదేహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.అనంతరం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పిల్లలను ఓదార్చుతూ భావోద్వేగానికి లోనయ్యారు.పిల్లల చదువుల ఖర్చులు భరిస్తామని,కుటుంబ సభ్యులను ఓదార్చుతూ,మనోధైర్యాన్ని ఇస్తూ,ఉసేని కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.మట్టి ఖర్చుల నిమిత్తం బాలనాగిరెడ్డి నగుదు రూపంలో 20 వేల రూపాయలు అందజేశారు.ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తో పాటు యంపిపి ఈరన్న,కన్వీనర్ బెట్ఠనగౌడ,యన్ నాగరాజు,బసిరెడ్డి,దొడ్డి నర్సన్న,మాన్వి వెంకటేష్,గట్టు భీమయ్య,వడ్డే ఉలిగయ్య, తుమ్మిగనూరు ఈరన్న, అగసనూరు నాగేష్ యన్ వీరారెడ్డి,ఇతర గ్రామాల నాయకులు తదితరులు నివాళులు అర్పించారు.



