మెట్టజ్యోతి. దేవి పట్నం మండలం.యువత క్రీడల పట్ల ఆసక్తి చూపుతో సమాజ సేవ తల్లితండ్రుల పట్ల గౌరవం యువత చెడు మార్గం లో నడవకుండా క్రీడాల పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండాలని దేవిపట్నం ఎంపీపీ కుంజం మురళి అన్నారు. దేవిపట్నం మండలం వెలగపల్లి గ్రామంలో మూడో రోజు నిర్వహిస్తున్న వైఎస్ఆర్ యూత్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన సందర్శించి టోర్నమెంట్ లో పాల్గొన్న యువతలను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడలతో యువతలో ఐక్యత భావం పెరగడమే కాకుండా, చెడు వ్యసనాలకు గురికాకుండా శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. క్రీడలతో పాటు చదువులలో కూడా రాణించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ పుసం పెద్ద, మడి రాజు, కోసు రామన్న దొర, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.