
(కర్నూలు ఆంధ్రన్యూస్) నంద్యాల జిల్లా,మిడ్తూరు మండలం,అలగనూరు గ్రామానికి చెందిన నాజీయా బాను (35) అనే మహిళకు నగరంలోని ప్రకాష్ నగర్,విఆర్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందక మృతి చెందిన ఘటన జరిగింది.కావున తమకు న్యాయం కావాలంటూ హాస్పిటల్ వద్ద నిరసన తెలియచేస్తున్నారు.గత సోమవారం హాస్పిటల్ నందు అపెండిక్స్ తో హాస్పిటల్ లో చేరారు.అయితే ఆదివారం హార్ట్ స్ట్రోక్ అంటూ మహిళా మృతి చెందినట్లు మహిళా బంధువులకు సమాచారం ఇవ్వకుండా హాస్పిటల్ నుండి మృత దేహాన్ని హాస్పిటల్ ప్రాంగణంలో వదిలి వేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.మహిళకు భర్త దావుద్ రహిమాన్, ముగ్గురు పిల్లలు
ఆఫీజ (18),అర్షియా (16),అబ్దుల్లా (14) ఉన్నారు.ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు న్యాయం కావాలని కోరుతూ మృత దేహంతో రోడ్డుపై నిరసన చేపట్టారు.



