
ఆంధ్రన్యూస్, : అచ్చుతాపురం : పరవాడ మండల శివారు గ్రామాలైన ఇరువాడ, దోప్పర్ల, చిట్టిబోయినపాలెం , దోసూరు, రావిపాలెం, నడింపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా సరిగా అందేది కాదు అని గుర్తించి ఎంఎల్ఏ సుందరపు విజయ్ కుమార్ చొరవతో అనకాపల్లి జిల్లా సూపర్డెంట్ ఇంజనీర్ ప్రసాద్ పర్యవేక్షణ లో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసారు.శుక్రవారం ఎంఎల్ఏ సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా ఇరువాడ జంక్షన్ వద్ద నిరంతర విద్యుత్ కొరకు త్రీ ఫేజ్ ఫీడేర్ ను ప్రారంభం చేసారు. దానికి గాను నునపర్తి నుండి నడింపల్లి వరకు ఇంటర్ లైన్ అతి తక్కువ సమయంలో శరవేగంగా పనులు పూర్తి చేసారు.సూపర్డెంట్ ఇంజినీర్ ప్రసాద్ మాట్లాడుతూ దీనికి గాను 30 లక్షలు వరకు ఖర్చు చేశామని,ఇప్పుడు వేసవి కాలంలో ఎటువంటి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉండవని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో నియోజకవర్గం ఎన్నో ఏళ్ల నుండి ఉన్న అనేక విద్యుత్ సంబంధిత సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు వేశామని , దానికి తగినట్లుగా నియోజక వర్గం పరిధిలో 2 నూతన సబస్టేషన్లు పనులు జరుగుతున్నాయని , అది పూర్తి అయ్యాక ఆయా సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలకు ఎటువంటి విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉండవని ఆయన తెలిపారు. అలానే ఈ ఇరువాడ పరిసర ప్రాంతాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి 24 గంటల 3 ఫేజ్ సప్లై చాలా అవసరమని దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో కూడా సబ్ స్టేషన్ వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. సబ్ స్టేషన్ వస్తే ఈ ప్రాంతంలో కూడా కంపెనీలు వచ్చి ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు .ఈ విద్యుత్ పనులకు ఈపిడిసిల్ సిఎండి, అనకాపల్లి సూపర్డెంట్ ఇంజనీర్ మరియు ఇతర విద్యుత్ అధికారుల సహకారం ఎంతో అభినందనీయం అని ఆయన కొనియాడారు. మన నిజయోకవర్గంలో విద్యుత్ వినియోగదారులను సోలార్ వైపు అడుగులు వేసేలా ఆ గ్రామ సర్పంచ్లు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పరవాడ , అచ్చుతాపురం సెక్షన్ పరిధిలో గల విద్యుత్ అధికారులు ADE శ్రీనివాసరావు, AE లు శ్రీనివాస్,సాయి ,మరియు కన్స్ట్రక్షన్ ఏడీఈ, ఏఈలు , లైన్ ఇనస్పెక్టర్ రాంబాబు, లైన్మన్ దుర్గా ప్రసాద్ , సురేష్ , మరియు మండల కూటమి నాయకులు కోరుపొలు చిన్నారావు , నర్మాల.రామకృష్ణ , బైలపూడి రామదాసు , జనపరెడ్డి.శ్రీనివాసరావు,చుక్క.అనురాధ ,కోలా.మహేష్,కోరుపోలు.సరోజారావు ,తదితరులు పాల్గొన్నారు.



