కౌతాళం ఆంధ్ర న్యూస్ నవంబర్ 07 కౌతాళం మండలం లో స్థానిక ప్రభుత్వం కాళాశాల నందు అకాడమిక్ ఇయర్ ప్రారంభమై 5 నెలలు అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేయలేదు. విద్యార్థులకు టెస్ట్ బుక్స్ ఇవ్వాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిరసన వ్యక్తం చేసినా టీ.ఎన్.ఎస్.ఎఫ్ నాయుకులు. మంత్రాలయం నియోజకవర్గ ఉపాధ్యక్షులు రామచంద్ర నాయుడు మాట్లాడుతూ ఇంతవరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం పై అగ్రహం వ్యక్తం చేశారు. చదువు కోవడానికి పాఠ్య పుస్తకాలు ఇవ్వండి మహాప్రబు మరోవైపు ఎగ్జామ్స్ దగ్గరకి వస్తున్నాయి అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో???అని ప్రసించారు. తక్షణమే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించాలని విద్యార్థులంతా కలిసి కళాశాల బయట నిరసన వ్యక్తంచేశారు. విద్యార్థులకు టెస్ట్ బుక్స్ ఇవ్వాలని, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వెతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండలం నాయకులు శ్రీరామ్, నాగరాజు, ఆర్కే మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823