మెట్ట జ్యోతి ఏలేశ్వరం: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య విస్తరణ అధికారి కే భాస్కరరావు తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక బాలిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రక్త శాతం, వయసుకు తగ్గ బరువు, ఎత్తు, తదితర అంశాలపై పరీక్షల నిర్వహించి యాప్ లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎటువంటి లోపాలున్న విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేస్తామన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలలో పరిశుభ్రత, టాయిలెట్స్ శుభ్రతను కూడా యాప్ లో పొందుపరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ ఎన్ అప్పలకొండ, సూపర్వైజర్లు ఎస్వీ రమణ, ఏసుబాబు, శివ రత్నం, హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్, నానిబాబు, హరిబాబు, జగదీష్, బి వి ఆర్ ఎన్ ప్రసాద్, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఉన్నారు.
విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు.
RELATED ARTICLES