Saturday, December 6, 2025
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లావిద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలి :ఏఐఎస్ఎఫ్

విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలి :ఏఐఎస్ఎఫ్

ఎమ్మిగనూరు:ఆంధ్రన్యూస్.
విద్యారంగంలో నెలకొన్నసమస్యల పరిష్కారానికై విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర పిలుపు నిచ్చారు. సోమవారం ఎమ్మిగనూరు స్థానిక సిపిఐ ఆఫీస్ లో పట్టణ నాయకులు సమీర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మహాసభలను ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర ఏఐఎస్ఎఫ్ నాయకులు రంగస్వామి మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అన్నారు. దేశ స్వాతంత్రం సంగ్రామంలో పాల్గొని బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఉద్యమించిందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో శాస్త్రీయ భావజాలాన్ని తొలగించి, ఆశాస్త్రీయ భావజాలాన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చి విద్యార్థుల మెదళ్లను మరింత అజ్ఞానంలోకి నెట్టుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జీవో నెంబర్ 117 ను అమలు చేసి జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రక్రియకు మగ్గు చూపడం ద్వారా అనేకమంది 3,4,5 తరగతుల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో బోధన బోధ నేతరుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. జిల్లాలో ఉన్న బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాలలో అనేక సమస్యలు విలయతాండవం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అధికారులు వాటిని గాలికొదిలేశారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దుచేసి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కడుపులు మాడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గం లో ప్రభుత్వ పీజీ కళాశాల ఏర్పాటు కొరకు పోరాటం కొనసాగిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు దస్తగిరి, రవి, సమీర్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.. పట్టణ నూతన కమిటీ ఎన్నిక: అనంతరం ఏకగ్రీవంగా పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా విష్ణు కార్యదర్శిగా అబ్దుల్ ఖాదర్ భాష కోశాధికారిగా సమీర్ ఉపాధ్యక్షులు సంతోష్, ఎర్రిసామి , మోహన్,వినోద్ సహాయ కార్యదర్శులు వీరేష్,బాబు,కార్తీక్, ము 11మంది సమితి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments