
(కర్నూలు ఆంధ్రన్యూస్)ప్రాముఖ్య తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్..తమిళనాడులోని కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.వెంటనే ఆయన స్పందిస్తూ నా గుండె ముక్కలైంది; నేను భరించలేని,వర్ణించలేని బాధలో,దుఃఖంలో ఉన్నాను. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి మరియు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.



