
(కర్నూలు ఆంధ్రన్యూస్)
రాంగోపాల్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘అధినాయక జయహే’ సిద్దార్థ్ రెడ్డి క్రియేషన్ బ్యానర్ పై రాంగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు..మధు జనగణమన ఈ చిత్రనికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం గ్లింప్స్ విజయదశమి సందర్భంగా విడుదల చేసారు.ఈ కథ నేటి లోకల్ రాజకీయ నాయకులు చేసే అన్యాయాలపై ఎదిరించే కామ్రేడ్’భీమదేవర ఆజాద్’గురించి ఉంటుందని డైరెక్టర్ మధు జనగణమన అని అన్నారు.. నంద్యాల ప్రాంతం నుంచి హీరోగా,ప్రొడ్యూసర్ గా రాంగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.ఈచిత్రానికి కెమెరామెన్, ఎడిటింగ్-శ్రీకాంత్ తొడుపునూరి,పని చేస్తూ..షారుక్ షేక్ సంగీతాన్ని అందించారు.



