
ఆంధ్రన్యూస్ కిర్లంపూడి: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల కేంద్రమైన జగపతినగరంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం వాలంటీరలకు గౌరవ సత్కారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.బుధవారం జగపతినగరం 1,2 గ్రామ సచివాలయాల పరిధిలో గల సుమారుగా 40 మంది వాలంటీర్లకు జగపతినగరం స్థానికి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి, వైఎస్ఆర్సిపి నాయకులు పెంటకోట నాగబాబు, చేతుల మీదగా వాలంటీర్లకు శాలువ కప్పి ప్రశంస పత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ఉండే ప్రతిఒక్కరికి మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెనగంటి రాజేష్, సంఘన వెంకటేశ్వరావు, ఆడారి గంగబాబు,దాడి పెద బుజ్జి,యల్లపు నానాజీ,నైదాన రఘు,శరకణం సంతోష్, వేగి సాంబాశివ,బిళ్ళకూర్తి నాగమణి, అలానే వైసిపి నాయకులు, కార్యకర్తలు,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.



