
ఎమ్మిగనూరు : ఆంధ్రన్యూస్. ఎమ్మిగనూరు పట్టణ పరిధిలోని వీవర్స్ కాలనీ గ్రౌండ్ ప్రక్కనగల గ్లోబల్ ఇండస్ స్కూల్ నందు ఈరోజు ఎమ్మిగనూరు వాల్మీకి వనభోజన సమితి నాయకులు బంగారు వెంకటేష్,రాఘవన్, కొండయ్య,మల్లయ్య, యాపిలయ్య,కృష్ణమూర్తి,హుసేని, రామకృష్ణ, నారాయణ,రంగన్న ల ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ఉదయం మహిళల ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూజలు నిర్వహించిన అనంతరం తులసి చెట్టుకు పూజలు నిర్వహించడం జరిగింది.అనంతరం డప్పుల శబ్దాలతో గ్లోబల్ ఇండస్ స్కూల్ నుండి ఆదోని బైపాస్ రోడ్ నందు గల ఆంజనేయస్వామి దేవాలయం దగ్గరకు చేరుకుని పూజలు నిర్వహించారు.తదుపరి నాయకులందరూ గ్లోబల్ ఇండస్ స్కూల్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం సభ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దాదాపు 80 వేల పైచిలుకు ఓటు బ్యాంకు కలిగిన వాల్మీకి సమాజానికి సంక్షేమ భవన నిర్మాణ నిమిత్తం స్థలాన్ని కేటాయించడమే గాక సంక్షేమ భవన నిర్మాణాన్ని కూడా త్వరలోనే సుసాధ్యం చేస్తానని వాగ్దానం చేసినందుకు మన స్థానిక ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి కి వాల్మీకి సమాజం తరఫున సభాముఖంగా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సభకు నూతనంగా హాజరైన వాల్మీకి సోదర,సోదరీమణులు సభాముఖంగా పరిచయాలు చేసుకోవడం జరిగింది. అనంతరం కుల బాంధవులందరూ కలసి సంతోషంగా వనభోజనాలు చేయడం జరిగింది. భోజన కార్యక్రమాలనంతరం పిల్లలకు, మహిళలకు ఆటల పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మునిస్వామి, మధుబాబు, తిమ్మారెడ్డి, నామాల శ్రీరాములు,హరి, లక్ష్మన్న,రంగస్వామి, జగ్గాపురం ఉరుకుందు, రాజ్ కుమార్ నాయుడు, గట్టు జయన్న, రంగము నాయుడు, వీరేష్,ఈరన్న,రామన్న, ముక్కన్న, గౌరీనాథ్, తిరుమలనాయుడు, నరసింహులు,యాపిలయ్య, గ్రామాల నుంచి వచ్చిన వాల్మీకి సోదరులు తదితరులు పాల్గొన్నారు.



