ఆంధ్రన్యూస్ : డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పల్లిపాలెం 216 జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ముమ్మిడివరం నుండి అమలాపురం వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి అమలాపురం నుండి కాకినాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును పల్లిపాలెం వద్ద బలంగా ఢీకొనడంతో ఈప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే డ్రైవరు లారీ క్యాబిన్ ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.వెంటనే సమీపంలో ఉన్న స్థానికులు లారీ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ నీ బయటికి తీసి రక్షించారు. అదేవిధంగా బస్సులో ఉన్న ప్రయాణికులకు రక్షించి సహాయక చర్యలు అందించారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆర్టీసీ బస్ లో ప్రయాణిస్తున ఒక మహిళ, లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన పై ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
REPORTER : MANIKANTA