
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం ఉరుకుంద పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామిని దర్శనానికి కోసం చేరుకున్న అనంతపురం జిల్లా లచ్చంపల్లి గ్రామం వాస్తవ్యులైన పి రాజేష్ కుమార్ రెడ్డి కుటుంబీకులు.అనంతరం శ్రీ ఈరన్న స్వామి వారి దేవస్థాన అభివృద్ధి కొరకు ₹ 59,000 రూపాయలు విరాళంగా చెల్లించి ఉన్నారు.వారికి దేవస్థానం వారు శ్రీ స్వామి వారి శేష వస్త్రములు లడ్డు ప్రసాదములు బాండ్ పేపర్ ఇచ్చి దర్శనం కల్పించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు జే నాగరాజ్ స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొనడం జరిగినది.అదేవిధంగా శ్రీ స్వామివారి నిత్య అన్నదాన పథకం కొరకు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం శభాష్ పురం గ్రామ వాస్తవ్యులైన వి రఘునాథ్ రెడ్డి గారు ₹ 50,000 రూపాయలు విరాళంగా చెల్లించి ఉన్నారు. వారికి దేవస్థానం వారు శ్రీ స్వామి వారి శేష వస్త్రములు లడ్డు ప్రసాదములు మరియు బాండ్ పేపర్ ఇచ్చి పూలమాలతో సత్కరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు మహాదేవప్ప స్వామి గారు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొనడం జరిగినది.



