రాజవొమ్మంగి మెట్టజ్యోతి,ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి గ్రామంలో స్థానిక 99 బిల్డింగ్ లో గల శ్రీ, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వర స్వామికి కార్తీక మాసం మహా పర్వదినం సందర్భంగా శనివారం లక్ష బిల్వపత్రములతో శివయ్యకు అభిషేకం జరిగిందని ఆలయ కమిటీ తెలిపారు, 11 మంది వేద పురోహితులతో మొదటిగా గణపతి పూజ, పంచామృతములతో, పుష్ప ఫలోదకములతో, మహన్యాస పూర్వక, ఏకాదశ వార మహా రుద్రాభిషేకములు లక్ష బిల్వార్చన, అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు, అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు నవుడూరి శ్రీనివాసరావు, శ్రీమతి అనుపమ దంపతులచే అన్న సమాధారణ కార్యక్రమం జరిగిందని ఆలయ కమిటీ తెలిపారు, కార్తీక మాసం అయినందున అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు