Saturday, December 6, 2025
spot_imgspot_imgspot_imgspot_img
HomeUncategorizedరైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఏ మొఖం పెట్టుకొని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలు చేపడతారు.

రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఏ మొఖం పెట్టుకొని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలు చేపడతారు.

  1.  చిత్తూరు, ఆంధ్రన్యూస్ : ఈరోజు చిత్తూరుజిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారం అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 13వ తారీకు నుంచి అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు రైతులను ఆదుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వ విఫలమైందని, యువతకు , నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలేదని నిరసన తెలియజేసే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. జిల్లా తెలుగుదేశం పార్టీ పత్రిక ముమ్మరంగా ఆక్షేపిస్తున్నాము.

 గత వైసిపి ప్రభుత్వంలో వ్యవసాయ కార్యాలయాలు మూసివేసి, రైతులను మోసం చేయడం, ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ పరికరాలు, సబ్సిడీ పథకాలు, వ్యవసాయ పనిముట్లు, సబ్సిడీ డ్రిప్ పరికరాలు నిలిపివేయడం నిజం కాదా? వీటన్నిటికీ రైతులకు సమాధానం చెప్పి ఆ తర్వాత నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నాము. అలాగే గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు అన్ని మీ కమీషన్ ల కక్కుర్తికి భయపడి ప్రక్క రాష్ట్రాలకు పరిశ్రమలు వెళ్లిపోవడం నిజం కాదా,? దీని ఫలితంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకపోవడం నిజం కాదా.? పాల రైతులకు లీటర్ కు నాలుగు రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి చివరకు చేతులెత్తేసి పాడిరైతులను మోసం చేయడం నిజం కాదా.?

 రీ సర్వే పేరుతో డ్రోన్ కెమెరాల ద్వారా తప్పుడు సర్వేలు, తప్పుడు పట్టా పాసు పుస్తకాలు మీ నాన్న ఫోటోలు మీ ఫోటోలు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలలో ముద్రించి , రైతులను బలవంతంగా అంటగట్టడం బోగస్ రిసర్వేలు నిర్వహించి పచ్చని గ్రామాలలో రైతుల మధ్య చిచ్చు పెట్టి అనేక సమస్యలను సృష్టించిన రైతులు పాలిట శాపంగా మారిన రిసర్వే సమస్యలు నిజం కాదా? . ఫ్రీ హోల్డ్ పేరుతొ ఎస్సీ,ఎస్టీ,బీసీలకు సంబంధించిన పేద రైతుల వారి భూములు కొట్టేయాలని కుట్ర చేయడం నిజం కాదా.? రాజధాని అమరావతి నిర్మాణం కొరకు భూములు ఇచ్చిన రైతులను నడిరోడ్డుపై ఈడ్చి పోలీసుల ద్వారా కొట్టి వారిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం నిజం కాదా? వీటన్నిటిపై రైతులకు సమాధానం చెప్పి ఆ తర్వాత నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం.!! ఈ కార్యక్రమంలోజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్,జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక గోపాల్, పూతలపట్టు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు ధరణి ప్రకాష్, నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments