
• రైతుల కష్టం వర్షార్పణం
• రైతులను తక్షణం ఆదుకోవాలని జనసేన డిమాండ్
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఉలపల్లి పందలపాక మధ్య అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకే కొనాలని, దేశానికి వెన్నుముకైనటువంటి రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు రైతు పిల్లిగోవింద్ మాట్లాడుతూ 16 ఎకరాలు భూమి కౌలుకు చేయడం జరిగిందని సుమారు తొమ్మిది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగిందని ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సమన్వయకర్త రావాడ నాగు, బిక్కవోలు అనపర్తి రంగంపేట మండల అధ్యక్షుడలు ఇందల వీరబాబు ఎన్ ఆర్ కె ప్రసాద్ రెడ్డి, గిరిజాల సత్తిబాబు, బిక్కవోలు వీర మహిళా పాఠం శెట్టి కాశీరాణి, మండలం యూత్ అధ్యక్షులు గుత్తుల శివకొండ బాబు, సతీష్, కోరాడ రామారావు, చంద్ర రావు, ప్రసాద్, కర్రి శ్రీను, జనసేన నాయకులు వడ్లమూరు గోవిందరాజు, సుంకర బుజ్జి, జన సైనికులు జనసేన నాయకులు పాల్గొన్నారు.



