
రాయచోటి : ఆంధ్రన్యూస్. జూపర్ ఎల్.ఈ.డి, బీ మీడియా స్పోర్ట్స్ వారు హెల్త్ & స్పోర్ట్స్ పై అమరావతిలో సంయుక్తంగా 10 కె రన్ నిర్వహించనున్నారు.
ఈ 10k రన్ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సముఖత తెలియజేశారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రికి 10 కె రన్ నిర్వాహకులు క్యాంపు కార్యాలయంలో వివరించారు. క్రీడలప భవిష్యత్తులో అనేక అవగాహన కార్యక్రమాలు అమరావతిలో చేస్తామని మంత్రి తెలిపారు. క్రీడా విభాగంలో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు



