కౌతాళం ఆంధ్ర న్యూస్ అక్టోబర్31 రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని వైసిపి జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి తెలిపారు. సోమవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’లో భాగంగా మండలంలోని కరణి గ్రామంలో పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను దేశమంతట గుర్తిస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో, ఇంకా సమస్యలు ఉన్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వైసిపి మండల నాయకులు అత్రి గౌడ్, నాగరాజు గౌడ్, ఏకం రెడ్డి, జడ్పిటిసి రాధా ప్రియదర్శిని, వైస్ ఎంపిపి బుజ్జి స్వామి, బసవ ప్రభు, మరి గౌడ్, ఈశప్ప గౌడ్, గురునాథ్ రెడ్డి, పాల్ దినకరన్, అవతారం చౌదరి, బసవరాజ్, వడ్డే రాముడు, అబ్దుల్ సమద్ పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823