Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeUncategorizedరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ విజ్ఞప్తి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ విజ్ఞప్తి

విశాఖపట్నం మెట్టజ్యోతి మే 26 : స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని తెలుగు వారి ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించాలని, ప్రభుత్వమే నిర్వహించే విధంగా జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి875.రామ్ అన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు వారందరి ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ ను ప్రజలు తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తర్వాత చెన్నై వెళ్లి ఎన్టీఆర్ ని కలిసి వచ్చేవారు. ఆయన్ని ఒక భగవంతుడిలా కొలిచేవారు. ఆ స్థాయి భారతదేశంలో ఎవరికీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సిఎం చంద్రబాబునాయుడుని నేనెప్పుడూ ఏదీ కావాలని అడగలేదు, పదవులు ఆశించలేదు. రాష్ట్రపరంగా పండగలా ఎన్టీఆర్ జయంతిని జరుపుకోవాలని తెలుగు ప్రజల ఆకాంక్ష. దానికోసమే నేను చంద్రబాబు కు విజ్ఞప్తి చేస్తున్నాను. అంతకుమించి ఇందులో ఏ స్వార్ధము లేదు. ఎన్టీఆర్ వర్ధంతి జనవరి 18, నా జననం కూడా జనవరి 18. అందుకే ఆయన మీద నాకు అత్యంత ప్రేమ అభిమానాలు ఉన్నాయి. తెలుగు ప్రజలు గుండెల్లో ఉన్న ఎన్టీఆర్ జయంతిని ఆత్మగౌరవ దినోత్సవంగా జరిపితే తెలుగుజాతి గౌరవం మరింత పెరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కూడా దీని పై సానుకూలంగా స్పందించి ఎన్టీఆర్ జయంతిని ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎంతో మంది తెలుగువారి గుండెల్లో ఆయన ఉన్నారు. కానీ బయటికి చెప్పలేకపోతున్నారు.27 తేదీలోగా జీవో ప్రకటించి ఎన్టీఆర్ జయంతిని పండగలా జరుపుకునే విధంగా జీవో విడుదల చేస్తే మహానాడు కూడా పండగ వాతావరణంలో జరుగుతుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments