
(కర్నూలు ఆంధ్రన్యూస్)అనంతరం ఎమ్మిగనూరు సర్కిల్ నందు ధర్నా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి DSF రాష్ట్ర నాయకుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కళాశాలలో చదువుతున్నారు.కానీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేని పరిస్థితి,రాష్ట్రం లో ఏర్పడింది.పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేకపోతే విద్యార్థులు చదువుకునేది ఎలా.? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని,అలాగే PG చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి అని,డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించేందుకు డి.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థుల అంత కలుపుకొని ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఎఫ్ నాయకులు డివిజన్ అధ్యక్షుడు నవీన్ మండల అధ్యక్షుడు వర్మ కిరణ్ సుకుమార్,సాయి,రాజ్ కుమార్,చరణ్ తదితరులు కలవడం జరిగింది.



