కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం బదినేహాల్ గ్రామము టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పాలకుర్తి తిక్క రెడ్డి సహకారంతో తెలుగుదేశం పార్టీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు క్లస్టర్ ఇంచార్జి వెంకటపతి రాజు ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి ఇదేం కర్మ అని ఈరోజు బదినేహాల్ గ్రామంలో ఈరోజు కురువ వీధిలో గ్రామ నాయకులు మాటూరు నరసింహులు ఉమేష్ గౌడ్ ప్రతి ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని మన రాష్ట్రానికి ఇదేమి కర్మ అని ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరూ కూడా సుభిక్షంగా ఉంటాము అన్నారు. నరసింహ మాటలాడుతూ వైయస్సార్ ప్రభుత్వం వచ్చే మూడున్నర సంవత్సరాల అవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమీ లేదు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజలను నవరత్నాలు పథకాలతో ప్రజలను నట్టేట ముంచారు. నిత్యవసర సరుకులు పెంచుకుంటూ అదేవిధంగా ఈరోజు కూడా నిజమైన నిరుపేద పింఛన్దారులను కూడా పింఛన్ తొలగింపు చేయడం చాలా సిగ్గుచేటు ఇలాంటి నీచ రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేదు నిరుపేదలను ఆదుకునే దేవుడు మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ నారా చంద్రబాబునాయుడు రావాలి అదేవిధంగా మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేస్తాం అని గ్రామంలో ఆ వీధి ప్రజలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ నాయకులు వలి భాష ఈరన్న బసవ సాధకలిభాష రమేష్ భీమేష్ మస్తాన్వలి గోపాల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.