రావులపాలెం : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం నాడు రావులపాలెం మండలంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ మహాలక్ష్మీ మోటార్స్ హీరో షోరూం వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నాగిరెడ్డితో పుట్టిన రోజు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీసీ సంక్షేమ సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పితాని రాంబాబు ఆధ్వర్యం లో అధిక సంఖ్యలో యువకులు నాగిరెడ్డితో పుట్టిన రోజు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈతకోట వివి వినాయక్ సేవా యూత్ సర్కిల్ అధ్యక్షుడు గండ్రోతు దుర్గా సురేష్ ఆధ్వర్యంలో కూడా నాగిరెడ్డికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.నాగిరెడ్డికి జెడ్పిటిసి కూడిపూడి శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ దండు వెంకట సుబ్రహ్మణ్యవర్మ, మాజీ జెడ్పిటిసి సాకా ప్రసన్నకుమార్, కర్రి వీర్రెడ్డి, యర్రంశెట్టి కాళీకృష్ణ, ఎంపిటిసి వత్సవాయి హరిబాబు, ఉప సర్పంచ్ ఏనుగుపల్లి నాగార్జున, యర్రంశెట్టి సత్తిరాజు, వైసీపీ నాయకులు మిత్రులు తదితరులు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలక వర్గ సభ్యులు. సోషల్ మీడియా ద్వారా కూడా అధిక సంఖ్యలో అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు