Saturday, January 24, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకొనసీమ జిల్లారాయవరం సచివాలయం -2 లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అనూహ్య స్పందన *ప్రతి ఇంట...

రాయవరం సచివాలయం -2 లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అనూహ్య స్పందన *ప్రతి ఇంట ప్రతి నోటా జగనన్న మాట *

రాయవరం సచివాలయం -2 లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అనూహ్య స్పందన
*ప్రతి ఇంట ప్రతి నోటా జగనన్న మాట *

మండల కేంద్రం రాయవరంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఈరోజు మరల వరలక్ష్మి అపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ సచివాలయం -2 కన్వీనర్ పడాల కమలారెడ్డి వైయస్సార్సీపి నాయకులు, గృహసారథులు, వాలంటీర్లు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి మన ముఖ్యమంత్రివర్యులు జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమముగా అందుతున్నాయా ? లేదా ? అని అడిగి తెలుసుకున్నారు
ప్రభుత్వ పాలన ఎలా ఉంది ? తెలుగుదేశం ప్రభుత్వానికి జగనన్న ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం ఉందా అని అడిగి తెలుసుకున్నారు కమలా రెడ్డి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల నుండి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధిని చూసి మీరు ఏ రకంగా అనుభూతి పొందుతున్నారు రాబోయే దినాలలో మీ అందరి యొక్క ఆలోచన విధానము ఎలా ఉందని తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది అన్నారు.ప్రతి ఇంటి వారు కూడా జగనన్న పాలనే మంచిగా ఉంది అని మరల జగనన్ననే కావాలి ! జగనన్ననే మేము గెలిపించుకుంటామని కొనియాడారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments