ఆంధ్రన్యూస్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండల కేంద్రంలో రోడ్డు కొరకు పోరాడతామని, స్థానిక వెలంపేట ఆంధ్రబ్యాంక్ సమీపం లో పైనుండి వర్షం కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనలు చేపట్టి అధిక సంఖ్యలో మహిళలు రోడ్డుపై వర్షపు నీటిలో నిలబడి రోడ్డు వెంటనే వేయాలి, అధికారులు స్పందించాలి అని నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు….. ఏమైనా రాయవరం గ్రామంలో గత 20 సంవత్సరాలుగా రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. దీనిపై కొందరి మహిళలు మీడియా తో మాట్లాడుతూ అధికారులు రోడ్ పరిస్థితిని గురించి కనీసం పట్టించుకోరని తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు రావాలంటూ సరైన సమాధానం చెప్పి ఇక్కడనుండి వెళ్లాలంటూ ఆందోళన చేశారు. ఇప్పటికైనా అధికారులు గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకు స్పందించి తక్షణమే రాయవరం గ్రామంలో ఉన్న రోడ్డు పరిస్థితులను పరిశీలించి వెంటనే రోడ్డు వేయాలని గ్రామ మహిళలు, అధిక సంఖ్యలో ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.
రాయవరం ఆంధ్రబ్యాంక్ సమీపంలో రోడ్డుపై గ్రామస్తులు ఆందోళన.
RELATED ARTICLES