ఆంధ్రన్యూస్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం రాయవరం రాజరాజేశ్వరి కాలనీలో దాస్ ప్రసాద్, రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రన్యూస్ స్టేట్ బ్యూరో మరియు గ్రేస్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ ప్రసాద్ పలివెల పుట్టినరోజు వేడుకలు రాజరాజేశ్వరి కాలనీలో గల తన స్వగృహంలో ఘనంగా జరిగాయి మొదటిగా కుటుంబ సభ్యులు బర్తడే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి ప్రసాద్ దంపతులను శాలువా, బొకేతో సన్మానించారు. మనుమలు జోయెల్ ప్రిన్స్, జాసన్ వైస్, ప్రిన్స్ వైస్, లిండ్ సీ కేక్ తినిపించి, బహుమతులు అందజేశారు. ప్రసాద్ మాట్లాడుతూ దేవుని దయవలన 62 సంవత్సరాల ముగించుకుని 63 సంవత్సరంలోకి అడుగు పెట్టాను అన్నారు సంవత్సరములోకి అడుగుపెట్టడానికి భగవంతుని యొక్క దయ ఉండాలి అన్నారు పుట్టినరోజు సందర్భంగా సుమారు 400 మందికి గ్రేస్ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు భోజనాలు ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమానికి యోగా మాస్టర్ మరియు మోహన్ కృష్ణ సంస్థల అధినేత వెలగల ఫణికృష్ణారెడ్డి, గ్రామ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తమలంపూడి గంగాధర్ రెడ్డి , కొల్లు రాంబాబు, ఎంఐ న్యూస్ మరియు స్టూడియో18 న్యూస్ కోనసీమ స్టాపర్ రేవు సురేష్ బాబు, అంగన్వాడి ప్రధాన కార్యదర్శి దొమ్మేటి ఆదిలక్ష్మి, ఏ సిటీ రిపోర్టర్ బాబి, వి బి సి రిపోర్టర్ రవి, రిపోర్టర్ వీరు, ఫౌండేషన్ వాలంటీర్స్ మరియు సభ్యులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
రాయవరంలో ఘనంగా ఆంధ్రన్యూస్ స్టేట్ బ్యూరో ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు.
RELATED ARTICLES