రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు
బిక్కవోలు, మెట్టజ్యోతి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామం రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంగళవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ గుత్తుల వెంకటరమణ ఆధ్వర్యంలో కర్రి రామకృష్ణారెడ్డి సభాధ్యక్షునిగా సభ నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా ముందుగా భోగిమంట వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం ఆటపాటలు కోలాటాలు గంగిరెద్దు ఆటలతో హరిదాసు రాధాకృష్ణుని వేషాలతో రవీంద్ర భారతి విద్యార్థిని విద్యార్థులు అలరించారు నర్సరీ ఎల్కేజీ పిల్లలకు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ముఖ్య అధితులతో భోగిపళ్ళు పోయించారు. ఈ సంబరాలను ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే సాంప్రదాయాల పండగని ప్రస్తుత తరుణంలో సాంప్రదాయాలు అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో ఈ తరం విద్యార్థులు ఉన్నారని దానిని దృష్టిలో పెట్టుకునే రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ గుత్తుల వెంకటరమణ ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు సాంప్రదాయాల మీద అవగాహన కల్పించడం నాకెంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ గుత్తుల వెంకటరమణ రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టి 33 సంవత్సరాలు అయిందని ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థికి చదువుతోపాటు వివిధ రంగాలపై అనగా బ్యాంకుకు వెళ్లి బ్యాంకులో డబ్బులు ఎలా డిపాజిట్ చెయ్యాలో బ్యాంకులో ఏ విధంగా ప్రవర్తించాలో అవగాహన కల్పిస్తూ అదే విధంగా ఇప్పటి విద్యార్థులకు వ్యవసాయంపై కూడా అవగాహన లేకపోవడంతో విద్యార్థులను పంట పొలాలకు తీసుకువెళ్లి వ్యవసాయంపై కూడా అవగాహన కల్పించడం అనేది నిజంగా తెచ్చుకో తగ్గ విషయం అని అంతేకాకుండా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ వంటి ఆసుపత్రులకు తీసుకుని వెళ్లి శరీరంలోని భాగాల పై కూడా అవగాహన కల్పించడం జరుగుతుందని ఇప్పుడు ఉన్న ప్రైవేటు పాఠశాలలు అన్నీ కూడా చదువులపై తప్ప సమాజంపై అవగాహన లేకుండా ఉంటున్నాయని దానికి విరుద్ధంగా సమాజం పై అవగాహన ప్రవర్తన తీరు పై కూడా సరైన శిక్షణ ఇస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఒక రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బలబద్రపురం మాత్రమేనని ఆయన కొనియాడారు అంతేకాకుండా విద్యార్థినీ విద్యార్థులకు ఆటల పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వడమే కాకుండా విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఆటల పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వడంతో పిల్లలపై తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక శ్రద్ధ ఏర్పడుతుందనె సదుద్దేశంతో అటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఒక్క రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ కు మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు అనంతరం రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గుత్తుల వెంకటరమణ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులకు మరియు బలబద్రపురం గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియ చేసారు ఈ కార్యక్రమంలో బలబద్రపురం గ్రామ సర్పంచ్ బంగారామారావు బిక్కవోలు మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ నల్లమిల్లి వెంకటరెడ్డి ఎంపీటీసీ చిర్ల వీర రాఘవరెడ్డి, సుజాత వెంకట్రామారెడ్డి ఎంపీటీసీ వీర రాఘవరెడ్డి మరియు వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు
రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు
RELATED ARTICLES