రాజవొమ్మంగి మెట్టజ్యోతి. జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు ఈరోజు మండల విద్యా వనరుల కేంద్రం వద్ద యు.టి.ఎఫ్ జిల్లా కార్యదర్సులు సొర్లం. రాజబాబు ఎం .ఉదయ్ మనోహర్ అధ్యక్షతన మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి డి. పైడిపల్లి ఏం. రమేష్ బాబు అధ్వర్యంలో యు.టి.ఎఫ్ మండల సిపిఎస్ కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవం గా జరిగాయి . మండల నూతన సిపిఎస్ కమిటీ ఎన్నిక వివరములు, యు.టి.ఎఫ్ మండల సి.పి.ఎస్ కన్వీనర్ గా సాధన పల్లి సత్యనారాయణ, కో-కన్వీనర్స్ గా అడ్డాల సతీష్ , రెడ్డి లక్ష్మి మరియు మండల సెక్రెటరీలు గా ఈకా బాపూజీ, టీ . నరసింహమూర్తి మూర్తి, వాసిరెడ్డి సత్యవతి, టి.సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.సి.పి.ఎస్ కన్వీనర్ సాధన పల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అనాడు పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు (సి.పి.ఎస్) కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం వెంటనే రద్దు చేయాలని – పాత పెన్షన్ విధానం అమలు చేయాలనీ అన్నారు. మండల సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కి యుటిఎఫ్ నాయకత్వం సహకారం తో కృషి చేస్తానన్నారు. కన్వీనర్ గా ఎంపిక చేసిన నాయకత్వం అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కో- కన్వీనర్ అడ్డాల సతీష్ మాట్లాడుతూ ఇటీవల రాజస్థాన్, పంజాబ్ , ఛత్తీస్ గడ్,రాష్ట్రాలలో సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ విధానం అమలు చేశారన్నారు అదే మాదిరి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సిపిఎస్ విధానం రద్దు చేయాలని, సిపిఎస్ కి జిపిఎస్ ( గ్యారంటీ పెన్షన్ స్కీమ్) ప్రత్యామ్నయం కాదన్నారు. కో – కన్వీనర్ రెడ్డి. లక్ష్మీ మాట్లాడుతూ కమిటీలతో కాలయాపన చేయడం సరికాదని CPS రద్దు అయ్యే వరకు యూటీఎఫ్ పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ మండల నాయకత్వం పి రమణ వెంకటలక్ష్మి , లక్ష్మీ ప్రసన్న, ఎం. సత్యవతి, నీలా తదితరులు పాల్గొన్నారు