
ఇచ్ఛాపురం మే29 (ఆంధ్రన్యూస్) అన్న ఎన్టీఆర్ యుగపురుషుడనీ పట్టణ టిడిపి అధ్యక్షుడు కాళ్ళ ధర్మారావు అన్నారు.ఆదివారం ఇఛ్చాపురం బస్టాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 100 వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.ఈ సంధర్బంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాళ్ళ ధర్మారావు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావుగారనీ అన్నారు. సినిమా రంగం ద్వారా తెలుగు ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ,రాజకీయ రంగం ద్వారా పేదవాడికి కూడు, గూడు గుడ్డ అందించేల చేశారని అన్నారు. దక్క త ఢిల్లీ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ అంతటి గొప్ప వ్యక్తినీ మరియు పేదల కోసం పరితపించే నాయకుణ్ణి ఈ తెలుగు నేలపై ఇంతవరకు చూడలేదని అన్నారు.అనాడు రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం తన కుమారుల పెళ్లికి కూడా హాజరు కాలేని రోజులున్నాయనీ ఆ సందర్భంలో తన భార్య బసవ తారక పిల్లలు పెళ్ళి విషయమై కూడా పట్టించుకోరా అని అడుగగా ఈ రాష్ట్ర ప్రజలను చూపిస్తూ వీళ్లంత మన పిల్లలు కారా అని అన్నారట.అంతటి మహానుభావులు మన అన్న ఎన్టీఆర్ అని అందుకే నేమో బహుశా నేడు ప్రతి తెలుగువాడికి దేవుడయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమం లో మహిళ అద్యక్షులు అశి లీలరాణి, మండల ప్రధాన కార్యదర్శి దక్కత కామేశ్వరరావు, కాళ్ళ జైదేవ్, నందిగామ కోటేశ్వరరావు,రెయ్య జానికి రావు, గిలాయి కృష్ణారావు,అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



