ఆంధ్రన్యూస్ : బూర్గంపాడు. బూర్గంపాడు ముస్లిం మైనారిటీ గర్ల్స్ స్కూల్లో మొన్న వచ్చిన వరదల కారణంగా స్కూల్ మొత్తం స్లాబ్ వరకు మునిగి పోయి ఫాన్స్, లైట్స్, ఇన్వెటర్, ఫుర్నీచర్ మొత్తం మునిగిపోయి పాడయి పోయాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న లయన్స్ క్లబ్ వాళ్ళు ఈరోజు ఫాన్స్, డూమ్ లైట్స్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పూర్ణ చందర రావు మాట్లాడుతూ పాఠశాల లో 10 వ తరగతి చదువుతున్న పిల్లలు ఈ సారి పబ్లిక్ పరీక్షల లో 10 పాయింట్లు వచ్చిన వారికి ₹.5000/- నగదు బహుమతి ఇస్తా అని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ దాట్ల శ్రీనివాస్ రాజు, కోశాధికారి నరసింహ చారి, లయన్ వెంకట రెడ్డి, గ్రీన్ భద్రాద్రి గౌరవ అధ్యక్షులు బోగాల శ్రీనివాస్ రెడ్డి, లయన్ డా.గోళ్ళ భూపతి రావు, జాయింట్ సెక్రటరీ ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపాల్ గీతా జ్యోతి, డిప్యూటీ వార్డెన్ యం.డి.షాజాహాన్, విజయ లక్ష్మీ, తరగతి ఉపాద్యాయులు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
మైనారిటీ గర్ల్స్ స్కూల్లో ఫాన్స్, డూమ్ లైట్స్ వితరణ.
RELATED ARTICLES