
*మేడే దినోత్సవాన్ని జయప్రదం చేయాలి*
ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వై.జ్యోతిబాబు,కిర్లంపూడి
ఏప్రిల్ 30:మేడే దినోత్సవాన్ని జయప్రదం చేయాలని సి ఐ టి యు జిల్లా కార్యదర్శి బాల శ్రీను అన్నారు. స్థానిక రాజు గారి వీధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్ వద్ద సిఐటియు మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు టి జీవా అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి బాల శ్రీను ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా బాల శ్రీను మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే 138వ వారోత్సవాలను కిర్లంపూడి మండలంలో ఉన్న అసంఘటిత కార్మికులు, వివిధ స్కీం వర్కర్లు,కార్మికులంతా కలసి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఈ మేడే స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. అలాగే మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందని వారన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుముక వంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారుమండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కార్మికులు మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి మండలంలో జరిగే ర్యాలీలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కార్యదర్శి రత్నం, శుభారత్నం, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.



